
ఇండియా జస్టిస్ రిపోర్టు-2025లో తెలంగాణ పోలీసులు ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచారు. 6.48/10 పాయింట్లతో తెలంగాణ తొలిస్థానం దక్కించుకుంది. పోలీసుశాఖకు నిధులు మంజూరు చేయడంతో అక్కడక్కడ మినహా.. పోలీసుల పనితీరు మెరుగుపడటంతో మళ్లీ తొలిస్థానంలో కొనసాగింది. ఇండియా జస్టిస్ రిపోర్టు ప్రకారం.. జైళ్ల సంక్షేమంలో తెలంగాణ 7వ స్థానానికి పడిపోయింది. లీగల్ ఎయిడ్ సర్వీసెస్‌లో తెలంగాణ ర్యాంకింగ్ 2025లో 10వ స్థానానికి దిగజారింది.