
వరల్డ్ వైడ్‌గా పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అవెయిటెడ్ మూవీ ‘OG’. ఈ మూవీలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పవర్ ఫుల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో ‘సత్య దాదా’ అనే పాత్రలో ఆయన కనిపించనున్నట్లు వెల్లడించారు. కళ్ల జోడు పెట్టుకుని సీరియస్‌గా ఉన్న ఆయన లుక్ ఆకట్టుకుంటోంది.