తమిళ స్టార్ హీరో సూర్య ఓ అభిమాని వివాహ వేడుకకు సడన్‌గా హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అరవింద్ అనే యువకుడు తన వివాహం సందర్భంగా కాబోయే భార్య కాజల్‌కు మర్చిపోలేని బహుమతి ఇవ్వాలనుకున్నాడు. కాజల్‌కు హీరో సూర్య అంటే ఎనలేని అభిమానం. అరవింద్ తమ పెళ్లికి సూర్యను ఆహ్వానించారు. ఊహించని విధంగా తన అభిమాన హీరో కళ్లముందు ప్రత్యక్షమయ్యేసరికి ఒక్కసారిగా షాకయిన కాజల్ కాసేపు నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. సూర్యను చూసినప్పుడు వధువు ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

