
పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల ప్రాంతంలో మహిళా హోం గార్డు ప్రియాంక ఆత్మహత్యాయత్నం ఆత్మహత్యకు ప్రయత్నించే ముందు ప్రియాంక ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తన బాధను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ప్రియాంక తన వీడియోలో..షఫీ, మైనుద్దీన్ అనే క్యాబ్ డ్రైవర్లు తాను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించింది. గోరంట్ల సీఐ శేఖర్ కూడా తనను వేధిస్తున్న వారికే వత్తాసు పలుకుతున్నారని వీడియోలో వెల్లడించింది.