పులివెందుల మాజీ సీఐ శంకరయ్య సర్వీసు నుంచి తొలగించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య సమక్షంలోనే ఇదంతా జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. అయితే కొన్ని నెలల కిందట సీఎం చంద్రబాబుకు సీఐ శంకరయ్య నోటీసులు పంపారు. సీఎం చంద్రబాబు తనపై చేసిన ఆరోపణల వల్ల పరువునష్టం వాటిల్లిందని నోటీసులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను సర్వీసు నుంచి తొలిగిస్తూ కర్నూలు రేంజ్ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు.

