కాలిఫోర్నియాకు చెందిన న్యూరోటెక్నాలజీ సంస్థ ఎలోన్ మస్క్ న్యూరాలింక్ అంధులకు శుభవార్త చెప్పింది. న్యూరాలింక్‌తో పుట్టుకతో అంధులైన వారికి సైతం 2026లో మొదటి మానవ పరీక్షలతో కళ్లు తెప్పించే దిశగా ప్రధాన చర్యలు తీసుకుంటోంది. దృష్టిని పునరుద్ధరించే లక్ష్యంతో న్యూరాలింక్ మెదడు చిప్ అయిన బ్లైండ్‌సైట్ సెప్టెంబర్ 2024లో US FDA నుండి ‘బ్రేక్‌త్రూ డివైజ్’ హోదాను పొందింది. 2026 ప్రారంభంలో న్యూరాలింక్ పూర్తిగా అంధులకు పరిమిత దృష్టిని
అందించే లక్ష్యంతో బ్లైండ్‌సైట్ మొదటి మానవ ఇంప్లాంటేషన్ కోసం సిద్ధమవుతోంది.

