“కొన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్లా. చిన్నప్పటి నుంచి వెళ్లే ఆలయాన్ని సందర్శించా. సమయాభావం వల్ల నేను చదివిన స్కూల్ని బయట నుంచే చూడాల్సి వచ్చింది. స్కూల్ని చూడగానే బాల్య జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. కుటుంబ సభ్యుల్లాంటి కొందరు స్కూల్ ఫ్రెండ్స్ని కలిశా. నా పెళ్లికి హాజరుకాలేకపోయిన కుటుంబ సభ్యులను కలిశా. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ నన్ను ఆశీర్వదించిన వ్యక్తులు వీరే. జీవితంలో ప్రతిదీ ఒక మంచి కారణం కోసమే జరుగుతుందని నాకు అనిపిస్తుంటుంది. ఆ కారణం ఇదే” అని రష్మిక పేర్కొన్నారు.

