భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆహ్వానించారు. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నియోజకవర్గవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించినట్టు చెప్పారు. శ్రీ సత్యసాయి మందిరానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.30 కోట్లు అదనంగా కేటాయించినట్టు చెప్పారు.

