కొందరు వ్యక్తులు పిల్లలను ఎక్కువగా కని హిందుస్థాన్‌ను పాకిస్థాన్‌గా మార్చాలని చూస్తున్నారని.. నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలకు ఒవైసీ సమాధానమిచ్చారు. తనకు ఆరుగురు సంతానం ఉన్నారని.. మీరు నలుగురు పిల్లలను కనకుండా
మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించారు. మీకు ఇష్టమైతే 8 మందిని కనండి.. మాకేం అభ్యంతరం లేదని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు పంచాయతీ లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధన ఉందని ఈ సందర్భంగా ఒవైసీ గుర్తు చేశారు.

