కేరళ సీఎం పినరయి విజయన్‌కు ప్రధాని మోదీకి మధ్య చీకటి ఒప్పందాలు జరిగాయని.. అందుకే ఢిల్లీ నుంచి గాడ్ ఫాదర్‌లా కాపాడుతున్నారని కేరళలో ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పినరయి విజయన్‌పై శబరిమల బంగారం చోరీ, గోల్డ్ స్మగ్లింగ్ వంటి తీవ్రమైన కేసులు ఉన్నప్పటికీ, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయన జోలికి వెళ్లడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేజ్రీవాల్ వంటి నేతలను అరెస్ట్ చేసిన ఈడీ.. విజయన్ విషయంలో మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు.

