
చాంపియన్స్ ట్రోఫీలో తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఒకే వేదికపై ఆడుతున్న భారత జట్టుకు ‘పిచ్ అడ్వాంటేజ్’ లభిస్తుందని వస్తున్న విమర్శలకు టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. దుబాయ్ తమ సొంత గ్రౌండ్ కాదని, ఇక్కడి పిచ్‌లు తమకూ కొత్త సవాళ్లను విసురుతున్నాయని తెలిపాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు నాసిర్ హుస్సేన్, అథర్టన్‌తో పాటు ఆసీస్ సారథి పాట్ కమిన్స్.. భారత్ అన్ని మ్యాచ్‌లను ఒకే వేదికపై ఆడటం వారికి భారీ ప్రయోజనాన్ని చేకూర్చుతుందని వ్యాఖ్యానించిన విషయం విదితమే.