
చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా ఆదివారం నాడు అధికారికంగా గుర్తించాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ యూకే, కెనడా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రాశ్చంలో సుస్థిర శాంతి నెలకొనేందుకు ద్విదేశ విధానానికి ఒట్టావా మద్దతిస్తోందని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు ‘సార్వభౌమాధికార, ప్రజాస్వామ్య, సుస్థిర పాలస్తీనా’ ఏర్పాటు కీలకమని పేర్కొంది.