
పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్స్ ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా అవకాశం కల్పించడంతో.. పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ కొలువు తీరాయి. లోక్ సభ క్యాంటీన్లో అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. అలాగే రాజ్యసభలోని క్యాంటీన్‌ను కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు.