
రాజ్యాంగం లోని ఆర్టికల్ 75, 164, 239AA లను సవరించడానికి ఉద్దేశించి.. 113వ సవరణ బిల్లు 2025ను హోం శాఖ మంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టగా.. ప్రతిపక్ష నాయకులు ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. 130వ రాజ్యాంగ సవరణ బిల్లులో “ముఖ్యమంత్రి పదవిలో ఉండి, వరుసగా 30 రోజులపాటు అరెస్టయి కస్టడీలో ఉంటే, 31వ రోజుకల్లా ఆయన తప్పనిసరిగా రాజీనామా చేయాలి. రాజీనామా చేయనట్లయితే, ఆ రోజునుంచే ముఖ్యమంత్రి పదవి ఆటోమేటిక్గా రద్దవుతుంది.”