పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని గిరిజన బాలికల కళాశాల హాస్టల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. 200 మంది విద్యార్థినులకు కేవలం 8 బాత్రూమ్లు మాత్రమే ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శిథిలావస్థకు చేరిన బాత్రూమ్లకు తలుపులు కూడా లేకపోవడంతో చున్నీలతో స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమస్యపై స్పందించి తక్షణమే హాస్టల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థినులు, స్థానికులు కోరుతున్నారు..

