
పానీ పూరీ అమ్ముతూ జీవనం సాగించే ఒక యువకుడు ఇస్రోలో ఉద్యోగం సంపాదించాడు. ఓ పేద కుటుంబంలో జన్మించిన రాందాస్ పట్టుదల, దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో కష్టపడి ఇస్రోలో టెక్నీషియన్ ఉద్యోగం సాధించారు.
తండ్రి డోంగర్గావ్ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్యూన్ గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాందాస్ పగటిపూట పానీపూరీ అమ్ముతూ.. రాత్రిపూట చదువుకుని తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.