మాజీ ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర పైన ప్రకటన చేసారు. గతంలో చెప్పిన దాని కంటే ముందే పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేసారు. వచ్చే ఏడాది జూలై నుంచి తన పాదయాత్ర మొదలు అవుతుందని వెల్లడించారు. పాదయాత్ర నుంచి కూటమి నేతలకు సినిమా మొదలవుతుందని హెచ్చరించారు.కూటమి ప్రభుత్వంలో మహిళల పైన వేధింపులు పెరిగాయని ఆరోపించారు. ఒక పత్రికాధిపతి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆ పత్రికాధిపతి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు, పవన్ ,లోకేష్ సమర్థించటం పైన జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

