ఢిల్లీలోని నంగ్లోయి ప్రాంతంలో దారుణం జరిగింది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)కి చెందిన బస్సు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న యువకుడిపైకి బస్సు ఎక్కడంతో అతడు అక్కడే మరణించాడు. అలాగే మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద ఘటనతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. బస్సు అద్దాల్ని ధ్వంసం చేశారు. బస్సుకు నిప్పు పెట్టారు. దీనిపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలు ఆర్పేశారు

