ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పాతబస్తీ మైలార్దేవుపల్లిలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలోనే 6,500 గజాల క్రీడమైదానాన్ని కాపాడినట్టుడా హైడ్రా వెల్లడించింది. ఈ స్థలం విలువ రూ. 100 కోట్లవరకు వుంటుందని అంచనా. 188 ఎకరాల హుడా అనుమతి పొందిన లేఔట్లో క్రీడాస్థలం కోసం కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. జీ ప్లస్ 3 అంతస్తుల నిర్మాణ దశలో ఉన్న భవనాలు ఐదింటిని హైడ్రా తొలగించింది.

