
పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసిన కారణంగా పశ్చిమ దేశాలకు ప్రయాణించేందుకు దూరం పెరిగి ఖర్చులు ఎక్కువై నష్టపోతున్నది కేవలం ఇండియన్ ఎయిర్‌లైన్స్ మాత్రమే కాదు..అనేక దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌లు కూడా.
తమపై నిషేధం లేనప్పటికీ అవి పాక్ గగనతలాన్ని స్వచ్ఛందంగా దూరం పెట్టడం గమనార్హం. ఎయిర్‌లైన్స్‌ల నుంచి ఓవర్‌ఫ్లైట్ ఫీజుల పేరిట ప్రతి నెలా లక్షల డాలర్లు వసూలు చేస్తున్న పాకిస్థాన్ ఏరోస్పేస్ సంస్థ ఇప్పుడా ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.