
మురీద్‌కేలోనే లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ, దాని మాతృ సంస్థ జమాత్-ఉద్-దావా కార్యాలయాలు ఉన్నాయి. అవి ఉగ్రవాద శిక్షణ శిబిరాలుగా కూడా పనిచేస్తున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో
ఉన్న ఈ కేంద్రం.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ప్రధాన కేంద్రాల్లో ఒకటి. ఈ స్థావరంపై దాడి చేయడం ద్వారా ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న ప్రదేశాలనే భారత్ లక్ష్యంగా చేసుకోవడాన్ని స్పష్టచేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రదేశాలు భారత సైనిక చర్యల నుంచి తప్పించుకోలేవనే సందేశాన్ని పంపింది.