
పహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆర్మీ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై అర్ధరాత్రి వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్‌ను ప్రధాని మోదీ రాత్రంతా పర్యవేక్షించారు. వార్‌రూమ్ నుంచి ఆయన లైవ్‌లో వీక్షించారు. ప్రతీ అప్‌డేట్‌ను మినిట్ టూ మినిట్ అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఆయా స్థావరాలను విజయవంతంగా కూల్చేయడంతో ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఉగ్రస్థావరాలు నేలమట్టం కాగానే ‘జైహింద్’ అంటూ డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.