
లోక్‌సభలో జరిగిన మూడు రోజుల ప్రత్యేక చర్చలో పాల్గొన్న మోదీ, పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పెద్ద స్థాయిలో స్పందిస్తుందన్న విషయం పాకిస్తాన్ సైన్యానికి అర్థమైందని ప్రధాని అన్నారు. అందుకే వారు అణ్వాయుధ భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నించారంటూ మోదీ ఆరోపించారు. మే 10న భారత దాడుల తర్వాత పాకిస్తాన్ తాము శాంతి కోరుతున్నామంటూ విన్నవించుకుందని ప్రధాని వెల్లడించారు. “పాకిస్తాన్ అప్పుడు ఇలా అన్నది – ‘చాలా కొట్టారు… ఇక మేము తట్టుకోలేం. యుద్ధం ఆపండి’ అని మనతో వేడుకున్నారు,” అని మోదీ విమర్శించారు.