
దుష్టశక్తులైన ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తూ, వాటిని రక్షిస్తున్న పాకిస్థాన్‌కు భారత్ భారీ షాక్ ఇచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన విమానాలకు భారత గగనతలంలో ప్రవేశాన్ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ప్రయాణికుల విమానాలతో పాటు మిలిటరీ విమానాలపై కూడా ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టంచేశారు. మే 23 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.