
5,00,00,00,000 ఈ నెంబర్ ఏంటనుకుంటున్నారా..? ఇండియా పాకిస్థాన్ యుద్ధంలో భారత్ తన సైనిక బలగాలు, యుద్ధ నిర్వహణకు చేస్తున్న ఒక్కరోజు ఖర్చు.. అది ఎంతో తెలుసా..? అక్షరాల ఐదువేల కోట్లు. భారత్ లాంటి దేశం ఒక్క రోజు యుద్ధం చేయాలంటే ఖర్చు చేయాల్సిన మొత్తం అది. యుద్ధమంటే .. ఫిరంగులు..విమానాలు.. బాంబులే కాదు.. వేల కోట్ల డబ్బు. ఒక దేశం ఒక్కసారి యుద్ధంలోకి దిగిందంటే వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఖర్చు చేసుకోవలసిందే.