ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని, దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. ఉగ్రవాద మూలాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. గత ఏప్రిల్‌లో కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారత దర్యాప్తు సంస్థలు చేసిన విచారణ, పాకిస్థాన్‌లోని టెర్రరిస్ట్ మాస్టర్ మైండ్‌లకు ఒక హెచ్చరికలా మారిందని షా అన్నారు.

