
జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ బైసరన్ లోయ వద్ద పర్యాటకులపై కాల్పుల ఘటనతో సంబంధం ఉన్న స్థానిక ఉగ్రవాదుల ఇళ్లను గురువారం రాత్రి ధ్వంసం చేశారు. వారి ఇళ్లలో భారీ పేలుళ్లు సంభవించనట్టు అధికారులు తెలిపారు. భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో జవాన్లు పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారని అధికారులు చెప్పారు. పాకిస్థాన్ నుంచే ఈ దాడికి కుట్ర జరిగినట్టు భారత్ బలంగా నమ్ముతోంది.