
పహల్గామ్‌లోని బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. వీడియోగ్రాఫర్ చిత్రీకరించిన వీడియో ఒకటి చిక్కింది. తాజాగా, దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కొకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయకు 20 నుంచి 22 గంటలు కష్టమైన దారిలో నడిచి వచ్చినట్టు దర్యాప్తులో తేలింది. దాడి సమయంలో ఉగ్రవాదులు ఒక స్థానికుడి, ఇద్దరు పర్యాటకుల నుంచి మొబైల్ ఫోన్లను లాక్కున్నారు. ఈ దాడిలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు పాల్గొనగా.. వీరిలో ముగ్గురు పాకిస్థానీలు, ఒకరు స్థానిక ఉగ్రవాది అదిల్ థోకర్ అని తెలుస్తోంది