
పహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది వ్యక్తుల్లో ఒకరైన శుభం ద్వివేది కుటుంబ సభ్యులను కాన్పూర్‌లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం పరామర్శించారు. రాహుల్ గాంధీ అమేథి నుంచి కాన్పూర్‌కు చేరుకుని ద్వివేది ఇంటికి వెళ్లారు. ఆయన ద్వివేదికి శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాహుల్ గాంధీ మంగళవారం రాయబరేలి, అమేథిలలో రెండు రోజుల పర్యటనను ప్రారంభించారు.