నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మరా గ్రామంలో జాతర సందర్భంగా జరిగిన పసికందు మృతిని నిరసిస్తూ కారేపల్లి మంఢలం సీతారాంపురంలో సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో యువకులు కొవ్వొత్తులు పట్టుకుని కుల వివక్షత, అణగారిన వర్గాలపై దాడులను నిరసించారు. పసికందు బేబి మౌనిక కుల మౌడ్యానికి బలి కావటం విచారకరమన్నారు. ఘటన జరిగిన వెంటనే బాధితులకు అండగా ఉండాల్సిన అధికార వ్యవస్ధ దాడి చేసిన అగ్ర కులస్తులకు వత్తాసు పలుకుతూ బాధితులపై కేసు నమోదు చేయడం విచారకరమన్నారు.

