పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల అంశంపై సమీక్ష నిర్వహించే నేపథ్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా అంశంపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించిన విషయం తెలిసిందే.భారత్ వద్ద ప్రస్తుతం 53 లక్షల మెట్రిక్ టన్నుల రిజర్వ్ ఇంధనం ఉన్నట్లు చెప్పారు. రాబోయే రోజుల ఆ సంఖ్యను 65 లక్షల మెట్రిక్ టన్నులకు చేర్చనున్నట్లు తెలిపారు. ఇంధన నౌకల తయారీ ప్రాజెక్టు కోసం సుమారు 70 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

