గల్ఫ్‌లో ఇరాన్ తీవ్రదాడుల సమయంలోనే శుక్రవారం టెహరాన్‌లోని టెహరాన్ స్కేర్‌లో బారీ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్, అమెరికా ఇక్కడ దాడులకు దిగినట్లు వెల్లడైంది. టెహరాన్ యూనివర్శిటీ దగ్గరిలోని ఇంగెలాబ్ స్ట్రీట్ వద్ద ఉన్న టెహరాన్ ఫిరదౌసి స్వేర్ వద్ద వరుసగా భీకర పేలుళ్లు జరిగాయి. చిన్నారులను చంపివేయడాన్ని నిరసిస్తూ జనం పెద్ద ఎత్తున గుమికూడిన దశలోనే దాడులు జరిగాయి. పేలుళ్లు జరుగుతున్నప్పటికీ జనం వస్తూనే ఉన్నారని వెల్లడైంది. అమెరికా, ఇజ్రాయెల్‌లకు చావు తప్పదని నినదించారు.

