పశ్చిమ బెంగాల్‌లో రెండు నిఫా వైరస్ కేసులు బయటపడ్డాయి. ఐసిఎంఆర్ లోని వైరస్ రీసెర్చి అండ్ డయాగ్నస్టిక్ లేబొరేటరీలో ఈ కేసులను నిన్న ( జనవరి 11) కనుగొన్నారు. జంతువుల నుంచి సంక్రమించే ఈ వైరస్ అత్యంత వేగంగా
వ్యాపించే ప్రాణాంతకం కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ’(హెల్త్ ), లతో కేంద్ర హెల్త్ సెక్రటరీ పరిస్థితిని సమీక్షించారు. వేగంగా నివారణ చర్యలు చేపట్టడంలో సమన్వయం వహిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు జాతీయ సంయుక్త బృందం నియామకమైంది.

