డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించొద్దని, DyCMగా పని చేస్తూ సినిమాలు చేయడం అనైతికమని, బాధ్యతలు తీసుకున్నాక వాణిజ్య కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఏపీ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. టికెట్ ధరల పెంపునకు పవన్ కల్యాణ్ కు సంబంధం లేదని ఏపీ ప్రభుత్వ ఏజీ వాదనలు వినిపించారు. పిటిషన్ కొట్టివేస్తూ న్యాయస్థానం మాజీ ఐఏఎస్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.తమ సమయం వృథా చేసిన పిటిషనర్ కు భారీగా ఫైన్ విధించాలని హైకోర్టు తీర్పునిచ్చింది.

