అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణికి 3 దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, దీంతోపాటు ఆమె ఆస్తులను ఆయన అఫిడవిట్లో వెల్లడించకుండా దాచి పెట్టారని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిమంత సతీమణి రిణికి భూయాన్, పవన్ ఖేడాపై కేసు పెట్టారు. దీంతో అస్సాం పోలీసుల బృందం నేడు దిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లారు. పోలీసులు పవన్ ఖేడా నివాసానికి వెళ్లేటప్పటికి ఆయన అక్కడ లేకపోవడంతో.. వారు ఆయనకోసం ఎదురుచూస్తున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

