పిఠాపురం రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదనలకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. రూ.37.25 కోట్లతో స్టేషన్ లో మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టేషన్ భవనం, ముఖద్వారంతోపాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతిగది నిర్మాణం,అత్యాధునిక టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, కేబులింగ్, ప్లాట్ ఫారం అభివృద్ధి, షెల్టర్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

