పరకామణి కేసులో సీఐడీ విచారణకు మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈరోజు (శుక్రవారం) విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్న వైవీ సుబ్బారెడ్డిని అడిషనల్ డీజీ రవి శంకర్ అయ్యన్నర్ విచారిస్తున్నారు.
రెండు రోజుల క్రితం టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, సీఎస్వో నరసింహ కిషోర్లను సీఐడీ ప్రశ్నించింది. పరకామణి కేసులో సుబ్బారెడ్డి స్టేట్మెంట్ను సీఐడీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి
కేసు డాక్యుమెంట్లను సీఐడీ కార్యాలయానికి అధికారులు తెప్పించుకున్నారు.

