
భారీ వర్షాలు, నిర్వహణ లోపాలతో కర్ణాటక రాజధాని బెంగళూరు లో గుంతలమయమైన రోడ్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నిత్యం ట్రాఫిక్ జామ్‌లు, గుంతలు నిండిన రోడ్లమీద ప్రయాణంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. రోడ్లపై గుంతలు పూడ్చే పనులు వేగంగా జరుగుతున్నట్లు, నగరంలో ట్రాఫిక్ సమస్యను సరిచేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎక్స్ పోస్టులోరాసుకొచ్చారు.