
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పన్ను విధానాలు, జీఎస్టీ వసూళ్లపై కీలక చర్చలు జరిగాయి. సీఎం స్పష్టంగా పేర్కొన్న విషయం టెక్నాలజీ ఉపయోగించి పన్ను ఎగవేతలను అడ్డుకోవడం అవసరం.పన్ను ఎగవేతలు గుర్తించేందుకు డేటా అనలిటిక్స్ ఉపయోగపడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ పరంగా దేశానికి ఆదర్శంగా నిలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.