ఎలక్షన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పని ఒత్తిడి వల్ల ఒక అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బూత్ స్థాయి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ‘SIR’ విధులను బహిష్కరించారు. ఉద్యోగ సంఘాలు కూడా నిరసన తెలిపాయి. ‘సర్’ పనిని నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. కన్నూర్‌లోని పయ్యన్నూర్‌లో బూత్ లెవల్ అధికారి (బీఎల్వో)గా పని చేస్తున్న 44 ఏళ్ల అనీష్ జార్జ్ ‘సర్’ పని వల్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఆదివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

