
పద్మ భూషణ్ అవార్డు అందుకున్న అజిత్ చెన్నైకి తిరిగి రాగానే విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. నాకు పెళ్లి కాకముందు షాలిని చాలా ఫేమస్ నటి. అభిమానులకు ఆమె అంటే చాలా ఇష్టం. కానీ పెళ్లి తర్వాత నా కోసం సినిమాలు మానేసింది. అది చిన్న విషయం కాదు. కొన్నిసార్లు నేను తప్పు నిర్ణయం తీసుకుంటే కూడా నాకు తోడుగా నిలుస్తుంది. ఈ అవార్డు, ప్రశంసలు పూర్తిగా ఆమెకే చెందుతాయి అన్న అజిత్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
.