
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 3 నుంచి జూన్ 13 వరకు జరిగిన పదో తరగతి సప్లీమెంటరి పరీక్షలకు 42,834 మంది దరఖాస్తు చేసుకోగా.. 38,741 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 28,415 మంది ఉత్తీర్ణలయ్యారు. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో 73.35 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 71.05 శాతం, బాలికలు 77 శాతం ఉత్తీర్ణత సాధించారు.