ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. శనివారం పదో తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం శనివారాన్ని రంజాన్ సెలవుగా ప్రకటించడంతో ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరీక్షను తిరిగి ఏప్రిల్ 2న నిర్వహిస్తారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్య విషయమేమిటంటే.. ఈ వాయిదా కేవలం ఇంగ్లీష్ పరీక్షకు మాత్రమే పరిమితం. మిగిలిన పరీక్షలన్నీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి.

