ఝార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ జిల్లాలోని నవాదిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ జామ్ కారణంగా ఓ భారీ ట్రక్కు.. రైలు పట్టాలపై నిలిచిపోయింది. అదే సమయంలో ఆ ట్రాక్ గుండా గోండా-అసన్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది. ముందు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రక్కు ముందుకు వెళ్లలేక ట్రాక్ పైనే నిలిచిపోయింది. దీంతో ఆ రైలు, ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. . దీంతో ట్రక్కును ఢీకొట్టిన రైలు అక్కడే ఆగిపోయింది ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టమూ సంభవించలేదు

