బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లిలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వాలనే.. పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నట్లు తెలిపారు. భూమి అనేది ఆస్తి మాత్రమే కాదని.. జీవనాధారం, భద్రత, గౌరవమని పేర్కొన్నారు.మీకు ఇచ్చే పాస్ పుస్తకాలను ఎవరూ తారుమారు చేయలేరు. కరెన్సీకి వాడే సాంకేతికతే పట్టాదారు పాస్ పుస్తకాలకు వాడాం. రూపాయి కూడా అవినీతి లేకుండా పాస్ పుస్తకాలు ఇవ్వాలనేది నా ఆలోచన అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

