
ఆంధ్రప్రదేశ్లో ఇక పంచాయతీ సెక్రెటరీ లను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా పిలువనున్నారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చాలని, ఆదాయం బట్టి పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు.