పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది న్యాయస్థానం. 42 శాతం రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని తామే చెప్పినట్లు హైకోర్టు గుర్తు చేసింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని ఈసీ అడ్వొకేట్ చెప్పుకొచ్చారు. తామే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించి, తామే స్టే ఎలా ఇస్తాం..?? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.

