పంచాయతీ ఎన్నికలు మొదటి దశకు సంబంధించి నామినేషన్ల గడువు ఇవాళ సాయంత్రం ముగిసింది. మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. ఆదివారం నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటు అయిన నామినేషన్ల వివరాలు వెల్లడిస్తారు. సోమవారం అప్పీళ్ల స్వీకరణ, వచ్చే నెల 2న అప్పీళ్ల పరిష్కారం ఉంటుంది. వచ్చే నెల 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారు.

