ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయిన వేళ నెదర్లాండ్స్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. దేశంలోని సెంట్రల్ అమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న చారిత్రక వాండల్కర్క్ చర్చిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం వేడుకల జరుపుకుంటుండగా 1880లో నిర్మితమైన క్యాథలిక్ చర్చిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు భారీగా వ్యాపించడంతో అక్కడున్న 50 మీటర్ల ఎత్తైన చర్చి టవర్ కుప్పకూలింది.

