
ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాధార స్తంభాల్లో అతి కీలకమైనది న్యాయవ్యవస్థ. అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు ప్రజలు చివరాఖరి దిక్కుగా న్యాయవ్యవస్థ వైపు చూస్తారు. కానీ, ఇటీవలి కాలంలో న్యాయదేవత ప్రభ మసకబారుతున్నది. కొందరు న్యాయమూర్తు ల ప్రవర్తన, తీర్పులు వివాదాస్పదమవుతున్నాయి. దేశ చరిత్రలోనే సంచలనాత్మకమైనదిగా మిగిలిపోయే ఈ కేసులో ఎలా వ్యవహరిస్తుంది? ఇటీవలే కళ్లకు గంతలు తొలగిపోయిన న్యాయదేవత ఈ ‘అగ్నిపరీక్ష’లోంచి ఎలా బయటపడుతుంది?అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.